శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (15:48 IST)

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. రాష్ట్రానికి వర్ష సూచన

Rains
తెలంగాణ ప్రజలకు శుభవార్త. తెలంగాణలో భానుడి సెగలతో మండిపోతోంది. తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. 
 
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇక రాబోయే రోజుల్లో ఎండలు విపరీతంగా ఉంటాయని పిల్లలు, వృద్ధులు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని జిల్లా అధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణకు వర్ష సూచన వుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.