సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (09:59 IST)

విద్యార్థుల మధ్య కొట్లాట.. డిగ్రీ సెకండియర్ విద్యార్థి హత్య.. ఎలా జరిగిందంటే?

crime scene
కొత్తగూడెం జిల్లాలో విద్యార్థుల మధ్య కొట్లాట ఓ యువకుడిని బలితీసుకుంది. జిల్లాలోని పలోంచ మండలం ఇందిరానగర్ కాలనీలో శనివారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కొందరు డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కొట్టి చంపేశారు. 
 
మృతుడు యానంబైలు గ్రామానికి చెందిన అల్లూరి విష్ణు(21) మండలంలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో చదువుతూ ఖాళీ సమయాల్లో డీజే సౌండ్‌ సిస్టమ్‌ నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. అదే కాలేజీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులతో వున్న గొడవలే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు చెప్తున్నారు.
 
శుక్రవారం సాయంత్రం ఇంటర్మీడియట్ విద్యార్థులు విష్ణు, అతని స్నేహితులతో గొడవ పడ్డారు. విషయాన్ని కళాశాల అధ్యాపకుడి వద్దకు తీసుకెళ్లగా ఆయన వారిని శాంతింపజేసే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాలు అక్కడ నుంచి వెళ్లిపోయాయి.
 
కానీ ఇంతటితో ఈ గొడవకు తెరపడలేదు. కళాశాల సమీపంలో రోడ్డుపై నిల్చున్న విష్ణుపై ఇంటర్మీడియట్ విద్యార్థులు దాడి చేశారు. ఆటో రిక్షాలో అటుగా వెళ్తున్న విష్ణు బంధువులు గమనించి అతడిని రక్షించేందుకు ముందుకొచ్చారు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విష్ణును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పాలోంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిలో ఐదుగురిని గుర్తించినట్లు సమాచారం.