శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (20:59 IST)

గూడ్స్ రైలు కింద పడిపోయిన మహిళ.. ఆమెకు ఏమైందో తెలుసా?

Train
Train
మహిళ పట్టాలు దాటుతుండగా రైవచ్చిన రైలు.. రైలు కింద పడుకొని తప్పించుకున్న మహిళ వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో ఓ మహిళ రైలు కింద పడిపోయింది. 
 
అయితే అది గూడ్స్ కావడంతో ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళితే, వికారాబాద్ - బషీరాబాద్ మండలంలో నవంద్దీ రైల్వే స్టేషన్‌లో టాకీ తండాకు చెందిన మహిళ రైలు పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చింది.
 
అయితే ఇదీ గమనించిన మహిళ వెంటనే పట్టాల పైనే పడుకుంది. పట్టాల మీదుగా రైలు వెళ్లినప్పటికీ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో గూడ్స్ రైలు పట్టాలు దాటే వరకు అట్టే రైలు కిందనే ఉండిపోయింది. దీంతో ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.