శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (15:54 IST)

అమాంతం పెరిగిపోయిన చికెన్ ధరలు..ఎక్కడ?

chicken
హైదరాబాదులో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత నాలుగు రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు 40 శాతం పడిపోయాయి. ఈ నెల 10వ తేదీ వరకు స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 180 నుంచి రూ.200 వరకు వుంది. 
 
లైవ్ కోడి ధర రూ. 120 నుంచి రూ. 160 మధ్య ఉంది. అయితే పెరుగుతున్న ఎండలతో పాటు ఇటీవల జరిగిన మేడారం జాతర నేపథ్యంలో కోళ్ల సరఫరా తగ్గపోయింది. హైదరాబాద్‌లో సగటున ప్రతి రోజు 12 వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి.