suvichar
✕

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ గ్రూపు-2 పరీక్షలు వాయిదా!

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 26 డిశెంబరు 2023 (12:35 IST)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన గ్రూపు-2 పరీక్షలు మళ్లీ వాయిదాపడ్డాయి. చైర్మన్‌తో సహా ఐదుగురు టీఎస్ పీఎస్సీ సభ్యులు రాజీనామాల విషయం ఎటూ తేలకపోవడంతో ఈ పరీక్షల నిర్వహణపై గందరగోళం నెలకొంది. దీంతో ఇపుడు మరోమారు వాయిదాపడ్డాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన విషయం తెల్సిందే. 
 
నిజానికి ఈ నెల 6, 7 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాల్సివుంది. ఈ తేదీలను రెండు నెలల క్రితమే ప్రకటించారు. కానీ, ఈ పరీక్షల నిర్వహణకు మరో వారం పదిరోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. దీంతో ఈ పరీక్షలు వాయిదా వేసినట్టేనని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
 
కాగా, రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 783 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ గతేడాది డిసెంబరు నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 5.5 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. ఆపై నవంబరుకు, మళ్లీ 2024 జనవరి నెలకి వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేక రీవైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments