Wife: భర్త వేధింపులు.. తాగొచ్చాడు.. అంతే కర్రతో కొట్టి చంపేసిన భార్య

సెల్వి
గురువారం, 2 అక్టోబరు 2025 (15:03 IST)
భర్త వేధింపులు భరించలేక భార్య కర్రతో కొట్టి హతమార్చింది. తాజాగా మేడ్చల్ పట్టణంలో జరిగిన మరో ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాగొచ్చిన భర్త వేధింపులను తట్టుకోలేక భార్య భర్తను కడతేర్చింది. మేడ్చల్ పట్టణం, ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్ (45), సావిత్రి దంపతులు నివసిస్తున్నారు. 
 
శ్రీనివాస్ భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో అతడు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి భార్య సావిత్రిని వేధింపులకు గురిచేశాడు. కానీ అతనిలో మార్పు రాలేదు. బుధవారం మరోసారి అతడు తన భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె భరించలేక అతడిని హతమార్చింది. క్షణకావేశంలో కర్రతో అతడిపై దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యకు భార్యే కారణమని అంగీకరించింది. దీంతో నిందితురాలు సావిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అన్నీ చూడండి

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

జీ5 కిడ్స్ లో యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ శివలోక్ కె కుండక్క మండక్క

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్. హైవాన్ లుక్

ప్రేమ, జ్ఞాపకాలతో తెరకెక్కిన సహ సినిమా చాలా నచ్చింది : కిరణ్ అబ్బవరం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఫీల్ మై లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments