మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (14:32 IST)

టిన్నర్ తాగి పాపాయి మృతి.. తలుపులకు రంగులు వేస్తూ..?

Kid
Kid
టిన్నర్ తాగి ఓ పాపాయి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆ బిడ్డ మృతి చెందింది. ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా తలుపులకు రంగులు వేస్తుండగా తెలియక టిన్నర్ తాగింది. వెంటనే పాపను హాస్పటల్ కు తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జాఫర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా వేడుకల్లో కుటుంబ సభ్యులు బిజీగా వున్నారు. తలుపులకు రంగులు వేస్తుండగా సౌమ్య (2) తెలియక కూల్ డ్రింక్ అనుకోని టిన్నర్ తాగింది. వెంటనే తల్లిదండ్రులు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయింది. 
2 yrs old kid dies after accidentally drinks chemical in warangal