సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:46 IST)

చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని పరీక్ష రాసిన యువతి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని కె.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 102 జ్వరంతో బాధపడుతూ పోలీస్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష హాజరైంది ఓ యువతి.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని కె.ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 102 జ్వరంతో బాధపడుతూ పోలీస్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష హాజరైంది ఓ యువతి. పరీక్ష హాల్లోనే సెలైన్ బాటిల్ పెట్టుకుని పరీక్ష రాస్తున్న విషయం తెలుసుకున్న కోదాడ డిఎస్పి సుదర్శన్ రెడ్డి పరీక్ష హాలుకు వచ్చి ఆమె అంకితభావాన్ని మెచ్చుకున్నారు.
 
ఆమె పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వాలని తోటివారు కోరుకున్నారు. కాగా తన జీవితాశయం పోలీస్ కావాలన్నదేనంటూ ఆ యువతి వెల్లడించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.