మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 22 మే 2020 (23:08 IST)

గుండెపోటుతో ప్రియుడు మరణం, వివాహిత మహిళను చావబాదారు

వివాహేతర సంబంధమే ఆ మహిళ పాలిట శాపంగా మారి మృత్యవాత పడింది. ఆ గ్రామంలో సదరు మహిళ మృతి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా మధిర అనంతసాగర్‌లో వేల్పుల వినోద రావు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రాంబాయి(వివాహిత)తో  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
సంబంధం సజావుగా సాగేందుకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు ఇరువురు మకాం మార్చారు. అప్పుడప్పుడూ స్వగ్రామం వచ్చి వెళుతుండేవారు. కరోనా నేపధ్యంలో ఇద్దరు స్వగ్రామం చేరుకుని ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటున్నారు. గత వారం రోజుల క్రితం వినోద రావు గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి అక్రమ సంబంధమే కారణం అయిందంటూ బంధువులు రాంబాయిను చితకబాదారు.
 
ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో రాంబాయి బంధువులు వినోదరావు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. రాంబాయి మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, వినోదరావుకు సంబంధించిన ఆస్తిపాస్తుల రాంబాయి పిల్లల పేర్లు రాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.