గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (12:38 IST)

దారికి అడ్డొచ్చిన సింహాలు .. ఆంబులెన్స్‌లోనే గర్భిణి ప్రసవం.. ఎక్కడ?

గర్భిణీని ఎక్కించుకుని వెళుతున్న ఓ ఆంబులెన్స్‌కు 12 సింహాలు అడ్డొచ్చాయి. దీంతో  ఆంబులెన్స్ డ్రైవర్‌కు ఏం చేయాలో తెలియక నడి రోడ్డుపైనే ఆంబులెన్స్‌ను నిలిపివేశాడు. ఇంతలో పురిటినొప్పులతో బాధపడుతూ వచ్చిన గర్భిణి ఆంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన ఓ గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్ ఆమెను ఎక్కించుకుని ఆసుపత్రికి బయల్దేరింది.
 
అయితే, మార్గమధ్యంలో నాలుగు సింహాలు రోడ్డుకు అడ్డుగా వచ్చి నిలబడ్డాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అంబులెన్స్‌ను డ్రైవర్ నిలిపివేశాడు. 
 
ఈలోగానే ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో.. అంబులెన్సులో ఉన్న అత్యవసర సేవల సిబ్బంది .. ఆమెకు డెలివరీ చేశారు. 20 నిమిషాల తర్వాత సింహాల గుంపు నెమ్మదిగా అక్కడి నుంచి కదిలింది. ఆ తర్వాత తల్లీబిడ్డలను ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.