Dharma Sangrah
✕

నిజామాబాద్ జిల్లాలో వాహనం ఢీకొని చిరుతపులి మృతి

Written By సెల్వి
Updated: శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (08:13 IST)
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది. చాంద్రాయణపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి చిరుతను ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
 
అతివేగం జంతువులను పొట్టనబెట్టుకుంటుంది. చాంద్రాయణపల్లి సమీపంలో చిరుతపులిని చంపేశారు.. అని తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్ పర్గేయన్ ట్వీట్ చేశారు. నిజామాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
 
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడవుల గుండా వెళ్లే హైవేలపై వాహనాల వేగాన్ని నియంత్రించాలని జంతు సంరక్షణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జంతువుల కోసం అడవుల్లో అండర్‌పాస్‌లు, వంతెనలు నిర్మించాలని సూచించారు.

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments