సందీప్ లో కష్టం, ప్రతిభ కనిపించింది : నాని
Sandeep Kishan, Nani, Ranjith Jayakodi,Divyansha Kaushik
హీరో సందీప్ కిషన్ రొమాంటిక్ యాక్షన్-ప్యాక్డ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మైఖేల్ ఫిబ్రవరి3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజరైన మైఖేల్ ప్రీరిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
నాని మాట్లాడుతూ.. మైఖేల్ టీజర్, ట్రైలర్, విజువల్స్, పెర్ఫార్మెన్స్ లు చూస్తుంటే కొత్త ఒరవడి మొదలౌతుందనిపిస్తుంది. చాలా సంవత్సరాలకి ఒక సినిమా కొత్తగా కనిపిస్తుంది. శివ వచ్చినప్పుడు మిగతా సినిమాలతో కొత్తగా అనిపించింది. అలాంటి సినిమా మైఖేల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూపిన ఎనర్జీ సినిమాలో వుంటే అందరూ భుజాన తీసుకొని మోస్తారు. అందులో డౌట్ లేదు. సునీల్ గారు మోహన్ గారు భరత్ గారు చాలా ప్యాషన్ గల నిర్మాతలు. మైఖేల్ మైల్ స్టోన్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టం, ప్రతిభ, అదృష్టం ఈ మూడు కలిసొస్తే చాలా టాప్ పొజిషన్ లోకి వెళ్తారు. సందీప్ లో కష్టం, ప్రతిభ నిరంతరం కనిపించింది. అదృష్టం కనిపించలేదు. మైఖేల్ తో అది మొదలౌతుందని నమ్ముతున్నాను. మైఖేల్ సందీప్ కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. తన కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను. దివ్యాంశ చాలా అందంగా కనిపిస్తోంది. దర్శకుడు రంజిత్ చాలా కొత్తగా తీశారు. కౌశిక్ చాలా మంచి టోన్ ఇచ్చారు. వరుణ్ కి మైఖేల్ లో సరైన క్యారెక్టర్ పడింది. ఇక్కడి నుండి యాక్టర్ వరుణ్ సందేశ్ ని చూస్తామని అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 3 మైఖేల్ ని థియేటర్స్ లో చూసి టీంని బ్లెస్ చేసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నాని, నేను కెరీర్ బిగినింగ్ నుంచి స్నేహితులం. కానీ సినిమా వేడుకకు నాని రావడం ఇదే తొలి సారి. మైఖేల్ నాకు స్పెషల్ మూవీ కావడం, ఈ వేడుకకు నాని రావడం మరింత స్పెషల్ అయ్యింది. దసరా టీజర్ చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యాను. నాని నిరంతరం స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాడు. ప్రీరిలీజ్ వేడుక అంటే కొంచెం టెన్షన్ గా వుంటుంది. కానీ మైఖేల్ సినిమాకి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టేశాను. నాకు బిగ్గెస్ట్ ప్రైడ్ లోకేష్ కనకరాజ్. నాకు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ రంజిత్ జయకోడి. నేను ఏదైతే చేయలేనని అనుకున్నారో అన్నీ సినిమాలో చేశాను. భరత్ గారు మమ్మల్ని బలంగా నమ్మారు. పుష్కర్ రాం మోహన్ రావు గారు, సునీల్ గారికీ కృతజ్ఞతలు. సమ సిఎస్ మైఖేల్ కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కిరణ్ కౌశిక్ చాలా బ్రిలియంట్ డీవోపీ చేశారు. ఇది ఆయన మొదటిన్ సినిమా అంటే ఎవరూ నమ్మరు. విజయ్ సేతుపతి గారికి ఎన్ని థాంక్స్ చెప్పిన సరిపోదు. ఈ సినిమాపై ఆయన ఎంతో ప్రేమ చూపించారు. ఆ ప్రేమ తెరపై కనిపిస్తుంది. దివ్యాంశ అమెజింగ్ కోస్టార్. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా చాలా మంచి రోల్ చేశారు. గౌతం మీనన్ మా గురువు గారు. ఆయన ఈ సినిమాలో చేయడం చాలా స్పెషల్. అలాగే అనసూయ కూడా చాలా మంచి పాత్ర చేశారు. ట్రైలర్ కి టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా బ్లడ్ మొత్తం పెట్టి ఈ సినిమా చేశానని చాలా మంది చెప్పారు. అయితే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇలానే ప్రేమ చూపిస్తూ వుండటం..ఇంకా అద్భుతంగా పని చేస్తాను అన్నారు.
దర్శకుడు రంజిత్ జయకోడి మాట్లాడుతూ.. ముందుగా నిర్మాతలకు కృతజ్ఞతలు. భరత్ గారు ఎంతో గొప్పగా చూసుకున్నారు. మొదట ఈ కథ మోహన్ గారికి చెప్పాను. అద్భుతంగా వుందని చెప్పారు. తర్వాత ఎప్పుడూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. సునీల్ గారు చాలా స్వీట్. మై హీరో సందీప్ .. మై బ్రదర్. లవ్ యూ సందీప్. ఇందులో భాగమైన నా స్నేహితుడు విజయ్ సేతుపతికి బిగ్ థాంక్స్. వరుణ్ సందేశ్ తన నటనతో ఆశ్చర్యపరిచారు. సామ్ సిఎస్, కిరణ్ కౌశిక్ వండర్ పుల్ వర్క్ ఇచ్చారు ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. తెలిపారు.