మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (10:12 IST)

ఆటోలో ఎక్కిన యువతి.. నిర్మనుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా మరో యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పట్టపగలే యువతిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్లు.. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. 
 
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న యువతి (20).. సంతోష్ నగర్‌లో ఓ ఆటో ఎక్కింది. పహాడీ షరీఫ్ తీసుకువెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ మరో యువకుడిని ఆటోలో ఎక్కించుకున్నాడు. 
 
అనంతరం ఆ యువకుడు యువతిని అరవకుండా నోరు మూయగా.. ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై యువతిని వదిలేసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
 
కాగా, బాధిత యువతి నేరుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆటో డ్రైవర్ల అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సౌత్ జోన్ పోలీసులు.. విచారణ చేస్తున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించి.. వివరాలు సేకరిస్తున్నారు. 
 
బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా విచారణ మొదలు పెట్టారు. యువతి ఆటో ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.