శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (11:04 IST)

హైదరాబాద్‌లో ఆటో చార్జీల బాదుడు.. బేస్ ఫేర్ రూ.40?

హైదరాబాద్ నగరంలో ఆటో చార్జీలు భారీగా పెరగనున్నాయి. బేస్ ఫేర్ చార్జీని రూ.20 నుంచి రూ.40కు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.25 చొప్పన పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చార్జీ రూ.11గా ఉన్న విషయం తెల్సిందే. ఈ ప్రతిపాదలను ఆ రాష్ట్ర రవాణా శాఖ ముందుకు ప్రతిపాదనలు పంపించారు. 
 
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఆటో బేస్ చార్జి రూ.20గా ఉంటే, దాన్ని రూ.40 చేయనున్నారు. 1.6 కిలోమీటర్‌కు బేస్ ఫేర్ అమలవుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటర్ వరకు రూ.11 చార్జీ ప్రస్తుతం ఉంటే దాన్ని రూ.25కు పెంచనున్నారు.
 
భాగ్యనగరి ఆటో డ్రైవర్ల సంఘాలతో పలు విడత చర్చల అనంతరం చార్జీల పెంపు ప్రతిపాదనలను రవాణా శాఖ ఆమోదానికి పంపించినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా, హైదరాబాద్ నగరంలో ఆటో చార్జీలను గత 2014లో సవరించారు.