గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (17:43 IST)

పూజా హెగ్డేకు రాధేశ్యామ్ జాత‌కం ముందే తెలుసా!

Pooja and her staff
జాత‌కాల‌పై ప్ర‌భాస్ హీరో న‌టించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా జాత‌కంపై చాలా అనుమానాలు వ‌స్తున్నాయి. ఈరోజు విడుద‌లైన ఈ సినిమా తెల్ల‌వారిజామున హైద‌రాబాద్‌లో షోలు కూడా వేశారు. హైద‌రాబాద్‌లో ఐదు ఆట‌లు ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. అయితే ఈరోజు చూసిన వారంతా ఈ సినిమాపై డివైడ్‌టాక్ ఇచ్చారు. ఇలాంటి సినిమాలు ప్ర‌భాస్ కెరీర్‌కు స‌రిప‌డ‌వ‌ని తెలియ‌జేస్తున్నారు. రిచ్‌గా వున్నా కామ‌న్‌మేన్‌ను ట‌చ్ చేసే అంశాలు కనిపించ‌వు.
 
మ‌రి ఇందులో న‌టించిన పూజా హెగ్డే ప్రేక్ష‌కురాలిగా త‌న‌కు ముందే ఈ సినిమా జాత‌కం తెలుసు అన్న‌ట్లు ఆమె నిన్న అర్థ‌రాత్రి త‌న సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేయడం విశేషం. ఇది ప్ర‌భాస్ అభిమానుల్లో ఆస‌క్తిగా మారింది. త‌నను త‌న టీమ్ త‌యారుచేస్తున్న ఓ ఫొటోను పెట్టి,  "నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు నా టీమ్ కి ధన్యవాదాలు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమా సమయంలో మీరు నా కోసం చేసిన అన్నిటికీ కృతజ్ఞతతో ఉంటాను" అంటూ  ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.