గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలా? బండి సంజయ్ ఫైర్
గవర్నర్ లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి నిర్ణయం సీఎం కేసీఆర్ మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ట. మహిళలంటే సీఎంకు మొదటి నుంచి చులకభావమే. తొలి మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం కల్పించలేదు. రాష్ట్ర మహిళంలదరూ కేసీఆర్ తీరును గమనించాలని కోరుతున్నాను. బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఆయన హెచ్చరించారు.