శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (18:27 IST)

గంజాయిపై యుద్ధం ప్రకటించాలి: సీఎం కేసీఆర్ పిలుపు

గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలన్నారు. డ్రగ్స్‌ మరియు గంజాయి అక్రమ రవాణా మరియు వాటి నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…. గంజాయి అక్రమ సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని… పరిస్థితి తీవ్రం కాకముందే అరికట్టాలని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని… తెలిసీ తెలియక దీని బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక పరిస్థితి దెబ్బతింటుందని… ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని… డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియామకం చేయాలని ఆదేశించారు. 
 
విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని… దీని కోసం ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గుడుంబా, గ్యాంబ్లింగ్ మళ్లీ వస్తున్నాయని… డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలని వెల్లడించారు సీఎం కేసీఆర్.