గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (09:55 IST)

నేడు డ్రగ్స్ దందాపై కీలక భేటీ : దిశా నిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

తెలంగాణా రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దే చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంబిగించారు. ఇందులోభాగంగా, మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. 
 
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర అధికారులు పాల్గొని డ్రగ్స్‌ పెడ్లర్లు, వినియోగాన్ని అరికట్టాలని పోలీసు, ఎక్సైజ్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
 
మాదక ద్రవ్యాల కేసుల్లో దోషులను హోదాతో నిమిత్తం లేకుండా శిక్షించాలని గతంలో సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ చర్యల అమలుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కోరారు.