మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (20:31 IST)

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ.. టీఆర్ఎస్ ఆరోపణల్లో నిజం లేదు

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు.
 
రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిందని లేఖలో పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా 13 ప్రాజెక్టులకు కేంద్రం కేటాయించిన నిధుల వివరాలను లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు.