సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (16:03 IST)

రాజన్న దేవుడుకి సీఎం కేసీఆర్ శఠగోపం : బండి సంజయ్ ధ్వజం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికోసం 400 కోట్లు కేటాయిస్తానని చెప్పిన కేసీఆర్... చివరకు ఊహ చిత్రాలు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తరపున  ప్రతిపాదనలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరపున రాజన్న ఆలయాన్ని మేం అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. రాజన్న దేవుడుకి సైతం సీఎం కేసీఆర్ శఠగోపం పెట్టారని ఆరోపించారు. దేవుడికిచ్చిన హామీలు నెరవేర్చకపోతే నీ సంగతి దేవుడే తేలుస్తాడంటూ, దేవాలయ అభివృద్ధి రంగు రంగుల బ్రోచర్లపై చూపిస్తూ ఇంకెంతకాలం భక్తులను మోసం చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.