శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (12:03 IST)

తెలంగాణాలో కఠిన ఆంక్షలు ... కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనలతో ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా పరిస్థితులపై సీఎస్‌తో సమీక్ష జరిపారు. ఇందుకోసం ఆయన మరోమారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, కఠిన ఆంక్షలను అమలు చేయాలని భావిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో జరుగనుంది. 
 
ఇందులో దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై విపులంగా చర్చించనున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే విద్యా సంస్థల సెలవులు పొడిగించిన నేపథ్యంలో ఓ వైపు కోవిడ్ కట్టడికి ఇతర రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధిస్తున్న తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.