Daily Horoscope
✕

తెలంగాణలో కరోనా నమూనాల సేకరణ నిలిపివేత!.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

Written By ఎం
Updated: శుక్రవారం, 26 జూన్ 2020 (11:50 IST)
కరోనా పరీక్షల పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రెండు రోజుల పాటు నమూనాల సేకరణను నిలిపివేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే ల్యాబుల్లో నమూనాలు పేరుకుపోగా, నిన్నటికి 8,253 నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితి వుంది. వీటిని మరిన్ని రోజులు నిల్వ ఉంచితే తప్పుడు రిపోర్టులు వస్తాయన్న ఆలోచనతో, వైద్య వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
గడచిన 9 రోజుల వ్యవధిలో 36 వేల మంది నుంచి నమూనాలను అధికారులు సేకరించారు. అయితే, రాష్ట్రంలోని 10 ప్రభుత్వ ప్రయోగశాలల్లో రోజుకు 2,290 రిపోర్టులు మాత్రమే వెలువరించే అవకాశం ఉంది.

దీంతో పరిశీలించాల్సిన నమూనాలు పెరిగిపోయాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి శనివారం నుంచి నమూనాలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.

అన్నీ చూడండి

Naga Chaitanya: తొలి పది నిమిషాలు మిస్ కాకండి - లార్జ్ స్కేల్ సినిమా వృషకర్మ తో వచ్చింది : నాగచైతన్య

Vishwak Sen : విశ్వక్ సేన్.. లెగసీ షూటింగ్ పూర్తి.. ఫిబ్రవరి లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

స్విట్జర్లాండ్‌ మ్యూజిక్ ఫెస్టివల్-2026లో అన్నమయ్య కీర్తన.. (Video)

రోడ్డు దాటుతున్న అల్లు స్నేహారెడ్డికి తృటితో తప్పిన ప్రమాదం, వీడియో వైరల్

Rajendra Prasad : ఎం.ఎస్. నారాయణ మనవరాలి వివాహ వేడుక లో రాజేంద్రప్రసాద్ ఇలా...

తర్వాతి కథనం
Show comments