బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:54 IST)

కరోనా ఎఫెక్ట్... ఆ గ్రామంలోకి తల్లికైనా నో ఎంట్రీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్న ఓ గ్రామ సర్పంచ్‌ పంచాయతీ నిర్ణయానికి కట్టుబడి సొంత తల్లికే ప్రవేశం నిరాకరించాడు.

బంధువుల ఇంటి నుంచి వచ్చిన తల్లిని తిప్పి పంపించేశాడు. ఈ సంఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండల పరిధిలోని గోసాయిపల్లిలో జరిగింది.

సిర్గాపూర్‌ మండల కేంద్రంలో మూడు కుటుంబాలను క్వారంటేయిన్‌లో ఉంచడంతో అప్రమత్తమైన గోసాయిపల్లి వాసులు గ్రామ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి బయటి నుంచి ఎవరూ రాకుండా కట్టడి చేశారు.

సిర్గాపూర్‌లో బంధువుల దగ్గర ఉన్న సర్పంచ్‌ సాయాగౌడ్‌ తల్లి సోమవారం స్వగ్రామానికి రాగా చెక్‌పోస్టు వద్ధ వీఆర్‌ఏలు ఆమెను నిలిపివేసి సర్పంచ్‌కు సమాచారమిచ్చారు.

ఇతర గ్రామాల నుంచి ఎవరినీ రానీయొద్దనే గ్రామస్థుల నిర్ణయాన్ని గౌరవించిన సర్పంచ్‌ తన తల్లికైనా అదే కట్టడి వర్తిస్తుందని తెలిపాడు. దీంతో సర్పంచ్‌ తల్లి తిరిగి వెళ్లిపోయింది.