శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 మే 2021 (10:21 IST)

ఏమాత్రం తగ్గని కరోనా: ఆసుపత్రిలో చేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఐతే ఆయనకు కరోనా ఏమాత్రం కంట్రోల్ కాకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. కేసీఆర్ కరోనా నెగటివ్ అని తేలడంతో మరికొద్ది రోజుల్లో క్యాంప్ ఆఫీసుకు వస్తారని అంటున్నారు. ఈలోపు కేటీఆర్, ఎంపి సంతోష్ కరోనా బారిన పడటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.