Dharma Sangrah
✕

ఈటెల రాజేందర్‌ చెక్.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణకు గాలం

Written By సెల్వి
Updated: సోమవారం, 7 జూన్ 2021 (17:29 IST)
L Ramana
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో.. ఆయనకు చెక్ చెప్పేందుకు అంతే వేగంగా పావులు కదుపుతోంది టీఆర్ఎస్.

ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆయనను ఫోన్ ద్వారా టీఆర్ఎస్‌కు ఆహ్వానించినట్లు ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి టీడీపీలో కొనసాగిన ఎల్.రమణ.. టీడీపీ హవా ఉన్న రోజుల్లో మంచి విజయాలు సాధిస్తూ వచ్చారు.
 
అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగైన తరువాత ఆయన కూడా పూర్తిగా లైమ్‌లైట్‌లోకి వెళ్లిపోయారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడిన క్రమంలో పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది.
  
మరోవైపు టీటీడీపీని వీడేందుకు సిద్ధమైన ఎల్.రమణను చేర్చుకునేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోందని.. వారి కంటే ముందుగానే ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ యోచిస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోగా.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా పార్టీని వీడితే తెలంగాణలో టీడీపీ దాదాపుగా కనుమరుగైనట్టే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అన్నీ చూడండి

మేమిద్దరం భార్యాభర్తలమే కానీ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం : రమ్యకృష్ణ

సీనియర్ నటుడు గిరిబాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

జూనియర్ ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి కాంబోలో చిత్రం

ఏమీ లేనపుడు ఎన్నో కావాలని కోరుకుంటాం : అమితాబ్ బచ్చన్

ప్రముఖ సినీనటుడు గిరిబాబు కన్నుమూత

తర్వాతి కథనం
Show comments