మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (14:21 IST)

ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కరోనా నెగటివ్..

వరంగల్‌ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. అన్నీ తానై విస్తృతంగా ప్రచారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కరోనా నెగటివ్ అని తేలింది. వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికలలో నిర్విరామంగా పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు తనతో పాటు తన సిబ్బందికి శనివారం కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ పలితం వచ్చింది. 
 
వరంగల్‌ మున్సిపల్ ఎన్నికల్లో 12రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు అలుపు లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు, ఎన్నికల సమావేశాలు, ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోల్లో పాల్గొన్నారు.  
 
వరంగల్ యం.జి.యం ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించి, కోవిడ్ వార్డులో కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను నేరుగా కోవిడ్ బాధితులతో మాట్లాడారు. నిరంతరం వైద్యసేవలు నిర్వహిస్తున్న డాక్టర్లను అభినందించి, ప్రొత్సహించారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆకస్మీకంగా తనఖీ చేసి వైద్య చికిత్సకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. 
 
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శుక్రవారం నుంచి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆదేశాలతో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించి డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు.