గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (12:20 IST)

హైదరాబాద్‌లో ఈడీ దాడులు: 15 చోట్ల సోదాలు

charminar
హైదరాబాదుతో పాటు దేశ వ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలలో ఈడీ అధికారులు సోదా చేస్తున్నారు. నకిలీ, నాసిరకం మందులు తయారు చేస్తున్న కంపెనీల గుట్టును అధికారులు రట్టు చేశారు. మొత్తం 18 ఫార్మా కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు. ఇందులో భాగంగానే శనివారం తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 
 
నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్ చెరు, మాదాపూర్‌లలోని ఫార్మా కంపెనీలు, ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు సహా మొత్తం 15 చోట్ల ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. 
 
పల్స్ ఫార్మా, ఫీనిక్స్ టెక్ జోన్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపైనా అధికారులు రైడ్ చేశారు. నకిలీ మందుల విషయంలో ఇటీవల డబ్ల్యూహెచ్ వో అలర్ట్ చేయడంతో మొత్తం 20 రాష్ట్రాల్లో ఉన్న 100కు పైగా కంపెనీలపై రైడ్ చేసిన సంగతి తెలిసిందే.