శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (16:57 IST)

చంద్ర బోస్ ద్యారా ఆనందం : చిరంజీవి

Chandra Bose, Chiranjeevi
Chandra Bose, Chiranjeevi
ఆస్కార్ వేదికపై అవార్డు పుచ్చుకున్న చంద్ర బోస్ ఇటీవలే డి. సురేష్ బాబును కలిసి తన ఆనందం పంచుకున్నారు. ఈరోజు చిరంజీవిని కలిశారు. హైద్రాబాదు శివారులో భోళాశంకర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా బోస్ అవార్డు తీసుకుని సెట్ కు వెళ్లారు. షూటింగ్ గ్యాప్ ఇచ్చి చిత్ర యూనిట్ బోస్ కు స్వాగతం పలికారు.
 
 
Chandra Bose, Chiranjeevi, ks ramarao and others
Chandra Bose, Chiranjeevi, ks ramarao and others
ఈ సందర్భంగా  చిరంజీవి మాట్లాడుతూ, 95 ఏళ్లలో ఆస్కార్ వేదికపై వినిపించే తొలి తెలుగు పదాలను మీరు అందించడం ఎంత అద్భుతమైన అనుభూతి. మీ ద్వారా ఆ క్షణాలను తిరిగి పొందడం ఆనందంగా ఉంది.  ఆస్కార్స్95కి విజయవంతమైన మార్చ్ తర్వాత ఇంటికి స్వాగతం పలుకుతున్నందుకు హృదయపూర్వకంగా ఉంది అన్నారు. 
 
Bhola shanker set
Bhola shanker set
సెట్లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత కె.ఎస్ రామారావు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అందరికి కృతజ్ఞతలు తెలిపారు చంద్రబోస్.