గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ప్రాణం తీసిన లేఆఫ్ భయం.. ఉద్యోగం పోతుందని టెక్కీ ఆత్మహత్య.. ఎక్కడ?

suicide
తెలంగాణ రాష్ట్రంలో ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో తీవ్రమైన ఒత్తిడిని అనుభవిస్తూ వచ్చిన ఆ టెక్కీకి ఉద్యోగం పోతుందనే భయం వెంటాడింది. దీంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. పుప్పాలగూడలో నివసిస్తూ వచ్చిన వినోద్ కుమార్‌ను గత కొన్ని రోజులుగా ఓ భయం వెంటాడుతూ వచ్చింది. లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం పోతుందనే భయంతో పాటు తన రోజు వారీ విధుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఆయన... తన గదిలోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వినోద్ కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు. కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలోనే టెక్కీగా పని చేస్తున్నాడు.