Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నేడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నిక సంఘం బృందం పర్యటన

Written By ఠాగూర్
Updated: బుధవారం, 1 నవంబరు 2023 (11:02 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘానికి చెందిన డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మలతో కూడిన ఈసీ బృందం బుధవారం తెలంగాణాలో పర్యటించనుంది. ఈ బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. 
 
ఈసీ బృందం... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం ఎన్ఫోర్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశంకానుంది. 
 
ఇప్పటివరకు చేపట్టిన తనిఖీలు, స్వాధీనాలపై సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితరాలపై చర్చిస్తారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments