బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:07 IST)

భద్రాది కొత్తగూడెం జిల్లాను వణికిస్తున్న వరుస ఎన్‌కౌంటటర్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్

భద్రాది కొత్తగూడెం జిల్లాను వరుస ఎన్‌కౌంటర్లు వణికిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందోనని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన మావోలను నియంత్రించాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు చనిపోయాడు.
 
ఈ  ఘటన జరిగిన నాలుగు రోజులకే మరో ఎన్‌కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ రెండు ఘటనలతో అడవి ప్రాంతాలలో అలజడి మొదలైంది. తెలంగాణలో అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా మావోలు వ్యూహ రచన చేస్తుండడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పదిరోజుల క్రితం మావోయిస్టుల యాక్షన్ టీం సభ్యుడు ఎన్ కౌంటర్లో మరణించాడు.
 
కొత్తగూడెం ఇల్లందుల ఏరియాల్లో మావోలు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. దీంతో కొత్తగూడెం సుదూర ప్రాంతపు అడవుల్లో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. వరుస ఎన్‌కౌంటర్లు కారణంగా ఏజెన్సీ పల్లెల్లో నిఘా మరింత పెంచారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వారిపై ఫోకస్ పెట్టారు.