Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరీష్ రావుపై ఈటెల వ్యాఖ్యలు.. నాకు పట్టిన గతే నీకూ కూడా..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 6 జులై 2021 (17:45 IST)
టీఆర్ఎస్ నేతలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో తనపై అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారని ఈటల అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. 
 
తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, తనపై కేసీఆర్ కుట్రలు చేశాడని ఆరోపించారు. వారి అబద్ధాల పత్రిక, ఛానల్‌లో పదేపదే చూపించారని అన్నారు. ఆ వార్తలు చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టారని పేర్కొన్నారు. తన నియోజకవర్గం వారికి హరీష్‌ దావత్‌, డబ్బు ఇస్తున్నారని ఆరోపించారు. 
 
మెప్పుపొందాలనే హరీష్‌రావు చూస్తున్నాడని, హరీష్‌రావుకు తన గతే పడుతుందన్నారు. మీ పార్టీలో గెలిచా అన్నారుగా.. అందుకే రాజీనామా చేశానని చెప్పారు. డబ్బు, ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్ ప్రజలకుందన్నారు. 
 
తమతో తిరిగే యువకుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అందరినీ బెదిరించి టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు. సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలి.. చుట్టంగా కాదన్నారు.

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments