దళిత బంధు ఒక బోగస్ - ఈటెల ఫైర్

మంగళవారం, 8 మార్చి 2022 (19:18 IST)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. 
 
అయితే ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ.. మోసపూరిత బడ్జెట్ ఇది అని మండిపడ్డారు. దళిత బంధు ఒక బోగస్ అని వెల్లడించారు. 90 శాతం దళిత బంధును పూర్తిస్థాయిలో వాడుకున్న కుటుంబం లేదని, ఒక్క కుటుంబం 10 లక్షల విలువ ఆధారిత వాడుకోలేదన్నారు.
 
ఈ పథకం కింద కేవలం 2-3 లక్షలతో సరిపెడుతున్నారని ఈటెల ఫైర్ అయ్యారు. హుజురాబాద్‌లో అదే జరిగిందని, రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం 37,220 కోట్లకు చేరిందని, తాగడానికి బానిసలను చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
మంచినీటి పథకానికి 19 వేల కోట్లు అని, మిషన్ కాకతీయ 6 వేల కోట్లు అని, నీతి ఆయోగ్ నిధులు కేంద్రం ఇవ్వలేమని చెప్పిన మళ్ళీ రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టారని ఈటెల విమర్శించారు.  

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments