మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (09:24 IST)

చిన్నారి ముఖంపై వాతలు పెట్టిన పెదనాన్న.. కాల్చిన స్టీలు పాత్రతో..?

మానవత్వం మరచి పసిబాలుడిపై పైశాచికత్వం ప్రదర్శించాడో మూర్ఖుడు. లేతబుగ్గలను ముద్దాడాల్సిన పెద్దనాన్నే చిన్నారి ముఖంపై వాతలు పెట్టాడు. జగద్గిరిగుట్టలో నాలుగురోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చింతల్‌ భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముండే సాయికుమార్‌ మూడేళ్ల కిందట చనిపోయాడు. అతని భార్య.. కుమారుడు నాగేంద్ర(5)ను వదిలేసి వెళ్లిపోయింది. 
 
అదేకాలనీలో ఉండే సాయికుమార్‌ అన్న రాజు(45) వద్ద బాలుడు ఆశ్రయం పొందుతున్నాడు. ఆ బాలుడిని వదిలించుకొనేందుకు ప్రయత్నిస్తున్న పెద్దనాన్న రాజు తరచూ హింసకు గురి చేస్తున్నాడు. కాల్చిన స్టీలు పాత్రతో ఇటీవల బాలుడి ముఖంపై వాతలు పెట్టాడు. 
 
స్థానికులు మేడ్చల్‌ జిల్లా లీగల్‌ లా ప్రొహిబిషన్‌ అధికారి సుజాతకు సమాచారం అందించారు. ఆమె బాలానగర్‌ బాలల సంరక్షణ బృందానికి ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం సిబ్బంది తనిఖీ చేసి, బాలుడిని సంరక్షణలోకి తీసుకొన్నారు. సంఘటనపై జీడిమెట్ల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.