Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా వచ్చి దొంగతనం చేసేవారు..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 24 డిశెంబరు 2021 (12:19 IST)
హైదరాబాదులో ఇళ్లల్లోని ల్యాప్‌టాప్‌లను దొంగలించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన పాటిల్‌ శివాజీ(23), బోయిన్‌ వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్ధన్‌రెడ్డి (23) ముగ్గురు స్నేహితులు.
 
వీరిలో వెంకటేశం, గోవర్ధన్‌రెడ్డి కూకట్‌పల్లి ఎల్లమ్మబండలో ఉంటూ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత వీరితో పాటిల్‌ శివాజీ కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయసాగారు. కొద్దిరోజులుగా ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తూ రెక్కీ నిర్వహించారు. 
 
ఇళ్లలోని కిటికీలు, తలుపుల వద్ద ఉన్న వస్తువులను తస్కరించేవారు. ఇలా కూకట్‌పల్లి ప్రాంతంలో ఏడు ల్యాప్‌టాప్స్‌, ఐప్యాడ్‌ను దొంగిలించారు. ఈనెల 22న ల్యాప్‌టాప్‌లను కేపీహెచ్‌బీకాలనీలోని పద్మావతి ప్లాజాలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు బైకు(టీఎస్15ఈడబ్ల్యూ8823)పై వచ్చారు. 
 
అక్కడే తనిఖీలు చేస్తున్న క్రైం సిబ్బందికి వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొన్నారు. విచారించగా చేసిన నేరాలను ఒప్పుకొన్నారు. వారినుంచి ఏడు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌, బైకును స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం సీఐ ఆంజనేయులు తెలిపారు.

అన్నీ చూడండి

Prabhas vs Salman: మార్చి 2027లో పోరుకు సిద్ధమవుతున్న ప్రభాస్ ఫౌజీ, సల్మాన్ మాన్‌స్టర్

Rajmouli Birthday: ప్రమాణాలు, కష్టపడేతత్త్వంతో ఎదిగిన ఎస్.ఎస్. రాజమౌళి కి ప్రముఖుల శుభాకాంక్షలు

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments