Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత... కేసీఆర్, చంద్రబాబు సంతాపం

Updated: సోమవారం, 29 జులై 2019 (16:27 IST)
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోమవారం తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన 1959 జూలై 1వ తేదీన జన్మించారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.
 
మంత్రిగా బాధ్యతలు చేపట్టి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారకు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న ముఖేష్ గౌడ్ 1986లో జాంబాగ్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా కార్పోరేటర్‌గా విజయం సాధించారు.
 
ముఖేష్ గౌడ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విచారాన్ని వ్యక్తం చేశారు. ముఖేష్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలనీ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments