ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (13:37 IST)

గురుకుల పాఠశాలలో బాలిక ఆత్మహత్య

suicide
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఏడో తరగతి చదువుతోంది. 
 
సోమవారం సాయంత్రం తోటి విద్యార్థులు ఆటల కోసం మైదానంలోకి వెళ్లగా బాలిక కనిపించలేదు. దీంతో మరో బాలిక ఆ విద్యార్థిని కోసం తరగతి గదికి వెళ్లి చూడగా, చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. 
 
విచారణలో చదువులో వెనకబడిందని ఉపాధ్యాయులు వేధించడంతోనే మనస్తాపంతో తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు.