సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 10 జూన్ 2017 (01:33 IST)

ముఖంలో కొంచెం కూడా సంతోషం లేకుంటే నువ్వూ నీ స్టైలూ వేస్ట్.. అని ఎవరు చెప్పారు?

సంతోషంగా ఉన్న మనిషి ఎల్లప్పుడూ స్టైలిష్‌గా ఉంటారు, అన్ని రకాల ఫ్యాషన్లను ఫాలో అవుతూ అప్‌డేట్‌గా ఉన్నా ముఖంలో సంతోషం లేకపోతే అవన్నీ నిరుపయోగం అని మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ అన్నారు. హైదరాబాద్ నగర ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి ఆధ్వర్

సంతోషంగా ఉన్న మనిషి ఎల్లప్పుడూ స్టైలిష్‌గా ఉంటారు, అన్ని రకాల ఫ్యాషన్లను ఫాలో అవుతూ అప్‌డేట్‌గా ఉన్నా ముఖంలో సంతోషం లేకపోతే అవన్నీ నిరుపయోగం అని మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ అన్నారు.  హైదరాబాద్ నగర ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎందరో డిజైనర్ల ప్రతిభను దగ్గర నుంచి గమనించిన తనకు మహిళలను శక్తివంతంగా చూపించే ఫ్యాషన్‌ బాగా మెప్పిస్తుందని చెప్పారు. అలాంటి డిజైన్లను శశి వంగపల్లి సృష్టిస్తుందంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా గత లాక్మె ఫ్యాషన్‌ వీక్‌లో ఆమె కోసం తాను ర్యాంప్‌వాక్‌ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సైతం శశి డిజైన్లను మెరిపించి దక్షిణాది డిజైనర్లలో ఎవరికీ దక్కని ఘనతను సాధించుకున్నారని అభినందించారు.
 
డిజైనర్‌ శశి వంగపల్లి మాట్లాడుతూ తన ‘కేన్స్‌’ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. త్వరలోనే నగరంలో అతిపెద్ద డిజైనర్‌ షోరూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సుస్మితాసేన్‌తో కలిసి ‘ఫర్‌ ది బ్యూటిఫుల్‌ షి’  పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి పలువురు మోడల్స్, నగర ప్రముఖులు హాజరయ్యారు.