తెలంగాణలో హరిత హారం.. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు నాటడమే లక్ష్యం

Written By సెల్వి
Updated: గురువారం, 25 జూన్ 2020 (09:50 IST)
తెలంగాణ సర్కారు ఈ నెల 25 నుంచి అంటే గురువారం నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జరిగిన ఐదు హరితహారాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఏటా కోట్లాది మొక్కలను సైతం నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం ప్రభుత్వం తీసుకుంది. 
 
30 కోట్లకుపైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నాహాలు సైతం చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నర్సాపూర్‌లో మొక్క నాటి ఈ హరితహారాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవి పునరుద్ధరణలో భాగంగా ఆయన మొక్క నాటి ఆరో విడత హరితహారానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నీ రహదారుల వెంట ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అన్నీ చూడండి

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

తర్వాతి కథనం
Show comments