మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (13:27 IST)

హైదరాబాద్‌లో మళ్లీ విజృంభించిన వరుణుడు.. మరో రెండు రోజులు అలెర్ట్

Hyderabad Floods
హైదరాబాద్‌లో మళ్లీ వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. నగరంలోనే అత్యధికంగా మౌలాలీలో 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
వాన నీటిలో పలు వస్తువులు, వాహనాలు కొట్టుకుపోయాయి. యూసుఫ్ గూడలో వర్షం నీటిలో ఫ్రిడ్జి కొట్టుకుపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
 
భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ స్తంభించడంతో ముందుకు పోలేక, వెనక్కి రాలేక వాహనదారులు నరకయాతన చూశారు.
 
హైదరాబాద్‌లోని నేరేడ్ మెట్‌లో 73 మిమీ, మల్కాజ్ గిరిలో 51.5 మిమీ వర్షపాతం పడింది. ఫతేనగర్, ఈస్ట్ ఆనంద్ బాగ్, ఆల్వాల్, తిరుమలగిరిలో దాదాపు 50 మిమీ వర్షపాతం నమోదైంది. 100 ఏళ్ల తర్వాత మూసీ నది విశ్వరూపం చూపింది. 1908లో హైదరాబాద్‌లో ఏర్పడిన వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.