బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: మంగళవారం, 11 ఆగస్టు 2020 (14:26 IST)

హైదరాబాద్ సుల్తాన్ బజారులో హైటెక్ వ్యభిచారం, అదుపులోకి తీసుకున్న పోలీసులు

అసలే కరోనా వైరస్ కారణంగా భౌతిక దూరం పాటించాలని చెబుతుంటే హైదరాబాద్‌లో ఏకంగా భారీ స్థాయిలో వ్యభిచార గృహాలనే నిర్వహిస్తున్నారు. బయట ఎక్కడైనా అయితే అనుమానం వస్తుందని లాడ్జీలోనే హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాదు పోలీసులు పట్టుకున్నారు.
 
నగరంలోని సుల్తాన్ బజారులో హైటెక్ వ్యభిచారం వెలుగుచూసింది. గుట్టు చప్పుడు కాకుండా లాడ్జిలో నిర్వహిస్తున్న భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. సుల్తాన్ బజార్ యాజమాన్యం లాడ్జిని వ్యభిచార దందాగా మార్చి వాడుకుంటుంది. ఎవరికి అనుమానం రాకుండా సెక్స్ వర్కర్లను అక్కడికి తీసుకువచ్చి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది.
 
సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జీపై నిఘా ఉంచారు. సోమవారం రాత్రి ఒక్కసారిగా లాడ్జీపై పోలీసులు దాడులు నిర్వహించి అక్కడున్న సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు. వ్యభిచార దందా కొనసాగిస్తున్న లాడ్జ్ యజమానిని అదుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.