ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్- ఉబెర్‌లో 140 మందికి ఉద్యోగాలు
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా సమయంలో భౌతిక దూరాన్ని ప్రోత్సహించేలా డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం, మార్కెట్‌లోకి ఆన్‌బోర్డ్ రెస్టారెంట్ మెనూలకు సంబంధించి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల అభివృద్దికి పెట్టుబడులు పెడుతున్నామని ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజా నియామకాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా కొత్తగా 140 మంది నియమించుకోనున్నట్లు ప్రకటించింది. డెలివరీ, మార్కెట్ ప్లేస్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కంప్లైయెన్స్, సేఫ్టీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాలలో ఈ నియామకాలుంటాయని ఉబెర్ సంస్థ వెల్లడించింది.
ఇటీవల భారీగా ఉద్యోగులను తొలగించిన ఉబెర్ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇంజనీర్ల నియామకాలవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 140 మంది ఇంజనీర్లను ఎంపిక చేస్తామని ఉబెర్ సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్ జయరామ్ వల్లియూర్ తెలిపారు.