శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (19:00 IST)

శంఖువు ఇంట్లో వుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయా? (Video)

Conch
శంఖువు ఇంట్లో వుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. శంఖువును పూజగదిలో అలంకరించి వుంచి పూజించడం ద్వారా ఆ ఇంట కుబేరుడు నివాసం చేస్తాడని విశ్వాసం. ఇంకా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శంఖువులో తీర్థాన్ని వుంచి, తులసీ దళాన్ని వుంచి పూజించిన తర్వాత.. ఆ నీటిని  స్నానం చేసే నీటిలో కలిపి స్నానమాచరించడం ద్వారా, బ్రహ్మ హత్య దోషమే తొలగిపోతుందట. 
 
శంఖువును పూజగదిలో వుంచి పూజించే ఇళ్ళల్లో బ్రహ్మహత్యే కాదు.. సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారంలో వాస్తు నిబంధన మేరకు ప్రతిష్టించి పూజించడం ద్వారా మూడు తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు. ఇంకా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహాదేవునికి 108 శంఖువులతో అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి. 
 
శంఖువులో నిలిచిన తీర్థాన్ని చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయి. ఇంకా వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే 108 శంఖువులతో శివునికి కార్తీక మాసంలో అభిషేకం చేస్తే.. కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. వాస్తు దోషాలుండే ఇళ్లలో తులసీ తీర్థాన్ని శంఖువును వుంచి శుక్రవారం పూట ఇంటిల్లిపాది చల్లడం ద్వారా దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.