శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (11:22 IST)

తెలంగాణలో పెచ్చరిల్లిపోతున్న కరోనా కేసులు

తెలంగాణ కరోనా కేసులు పెచ్చరిల్లిపోతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. మొత్తంగా 637 మంది మృతి చెందారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్ కేసులున్నాయి. 57,586 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 6,24,840 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ 389, రంగారెడ్డి 86, సంగారెడ్డి 84, కరీంనగర్‌ 73 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో చోటుచేసుకున్న పెను అగ్నిప్రమాదం అనంతరం కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడానికి తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. 
 
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర భవన సముదాయాల్లో వాటిని ఏర్పాటు చేశారు. వేలమంది కరోనా వైరస్ పేషెంట్లు వాటిల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.