ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (10:05 IST)

పరువు హత్య: రూ.10 లక్షలు సుఫారీ.. అల్లుడిని చంపించిన మామ

crime scene
భువనగిరిలో పరువు హత్య కలకలం రేపింది. కుమార్తె తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని రూ.10 లక్షల సుపారీతో అల్లుడిని మామ చంపించాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో పరువు హత్య కలకలం సృష్టించింది. 
 
పట్టణంలో శుక్రవారం అదృశ్యమైన ఎరుకుల రామకృష్ణ (32) అనే యువకుడు విగతజీవిగా మారారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం శివారు పెద్దమ్మతల్లి దేవాలయం సమీపాన నిర్మాణంలో ఉన్న రైల్వే లైను పునాదిలో అతడి మృతదేహం లభ్యమైంది. 
 
తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో రామకృష్ణను అతడి మామ వెంకటేష్‌ సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుని భార్య భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమృతయ్య అనే వ్యక్తిని విచారించగా మొత్తం కుట్ర బయటికొచ్చింది.