శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (12:17 IST)

భర్తకు దూరంగా వున్న యువతి గర్భం దాల్చింది...

woman victim
భర్తకు దూరంగా వుంటున్న మహిళను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కౌడిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) గతేడాదే ఓ వ్యక్తితో వివాహమైంది. 
 
అయితే మనస్పర్థల కారణంగా ఏడాదికే వారిద్దరూ విడిపోయారు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆమెకు సమీప బంధువు,బావ వరుసయ్యే నరసింహ అనే వ్యక్తి యువతికి ప్రేమ పేరుతొ దగ్గరయ్యాడు.
 
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. తరచూ ఆ యువతితో లైంగిక కోరికలు తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. 
 
దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని నరసింహను కోరగా తనకేమీ తెలియదని చేతులెత్తేశాడు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.