Daily Horoscope
✕

అవినీతికి పరాకాష్ట.. లంచం ఇస్తేనే అంత్యక్రియల చెక్కు ఇస్తాం...

Written By ఠాగూర్
Updated: బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి రాజ్యమేలుతున్నట్టుగా ఉంది. ఇటీవలి కాలంలో ఈ రాష్ట్రంలో అవినీతి బకాసురులు బయటపడుతున్నారు. ఇప్పటికే పలువురు అవినీతిపరులను అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తాజాగా మరో లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి తల్లి అంత్యక్రియలకు మంజూరైన చెక్కును అందించేందుకు లంచం డిమాండ్‌ చేసిన అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
హైదరాబాద్‌ నగరంలో మంగళవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూసారాంబాగ్‌కు చెందిన ఏ.క్రాంతి కుమార్‌ తల్లి ఇటీవల చనిపోయింది. అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.20 వేలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించి మంజూరైన చెక్కును బాధితుడికి అందజేసేందుకు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-10, పూల్‌బాగ్‌, ఫలక్‌నుమా, చార్మినార్‌ జోన్‌లో ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేసే వాద్యా పూల్‌ సింగ్‌ రూ.5 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. 
 
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్‌ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఏ అధికారి అయిన లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ కాంటాక్ట్‌ నంబరు 1064 కాల్‌ చేసి తెలపాల్సిందిగా సూచించారు. 

అన్నీ చూడండి

AA23: రచయిత అప్‌డేట్‌తో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు ఊపు

Akhil Japan : జపాన్ లో అఖిల్ అక్కినేనిపై అమితమైన ప్రేమ ప్రదర్శన

Tabitha sukumar : ఇడుపు కాయితం లో ఉల్లిపూల సాంగ్ కోసం తబిత అక్క ఎంతో తపన పడ్డారు : ప్రియదర్శి

Seetannapeta Gate : వినూత్నమైన కథగా సీతన్నపేట గేట్ : హీరో వేణు గోపాల్

Naga Chaitanya: తొలి పది నిమిషాలు మిస్ కాకండి - లార్జ్ స్కేల్ సినిమా వృషకర్మ తో వచ్చింది : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments