శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (19:23 IST)

నా భార్యను కిడ్నాప్ చేశారు... పరువు కోసం చంపేస్తారేమో? భర్త ఫిర్యాదు

హైదరాబాదులో ప్రేమపెళ్లి చేసుకున్న ఓ భర్త తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారంటూ మీడియా ముందుకు వచ్చాడు. తాము గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామనీ, ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు సర్టిఫికెట్ కూడా చూపించాడు. ఐతే తన

హైదరాబాదులో ప్రేమపెళ్లి చేసుకున్న ఓ భర్త తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారంటూ మీడియా ముందుకు వచ్చాడు. తాము గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామనీ, ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు సర్టిఫికెట్ కూడా చూపించాడు. ఐతే తన భార్య ముస్లి అనీ, తాను హిందువునని చెప్పుకొచ్చాడు. 
 
తను బేగంబజార్‌లో వుంటాననీ, పెళ్లి సమయంలో తన భార్య హిందువుగా మారి తన పేరును పూజగా మార్చుకున్నట్లు వెల్లడించాడు. కాగా తను ఇంట్లో లేని సమయంలో తన భార్యను ఈ నెల 17న కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని ఆరోపిస్తున్నాడు. తన భార్య పూజ ప్రస్తుతం 4 నెలల గర్భవతి అనీ, ఆమెకు అబార్షన్ చేయిస్తామని అమ్మాయి తండ్రి బెదిరిస్తున్నారనీ, ఆమె ఎదురు తిరిగితే పరువు కోసం ఆమెను కూడా చంపేస్తారేమోనని భయంగా వుందని మీడియా ముందు వెల్లడించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు పట్టించుకోవడంలేదంటూ ఆరోపిస్తున్నాడు.