సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (09:23 IST)

జీడిమెట్లలో తొమ్మిదేళ్ళ బాలికపై తాత అత్యాచారం

హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ళ బాలికపై ఓ తాత లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం జీడిమెట్ల పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని చింతల్‌లో జరిగింది. బాధిత బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వెల్లడైంది. దీంతో పోలీసులు పోక్సోచట్టం కింద కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చింతల్‌లో 65 యేళ్ల వృద్ధుడు నివాసముంటున్నాడు. కొడుకు కూతురు (9 ఏళ్లు) నాల్గోతరగతి చదువుతోంది. చిన్నారిపై వారం రోజులుగా తాత లైంగిక దాడికి పాల్పడినట్టు పాపతల్లి చెప్పింది. 
 
తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని రిపోర్టులో లైంగికదాడి జరగలేదని తేలిందని సీఐ బాలరాజు తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తిగొడవలు కూడా ఉన్నాయని ఈకోణంలో కూడా కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.