శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 18 మార్చి 2017 (09:43 IST)

సెక్స్ సుఖాన్ని ఇవ్వలేని నువ్వూ ఓ మగాడివేనా?.. హేళన చేసిన భార్య... భర్త ఏం చేశాడు?

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను భార్య హేళన చేసింది. అదీ కూడా అతని మగతనంపై. ఇంతకీ ఆ భర్త చేసిన తప్పేంటో తెలుసా..? పడక గదిలో భార్యను సుఖ పెట్టలేక పోవడమే. "సెక్స్ సుఖాన్ని ఇవ్వలేని నువ్వూ ఓ మగాడివేనా?" అం

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను భార్య హేళన చేసింది. అదీ కూడా అతని మగతనంపై. ఇంతకీ ఆ భర్త చేసిన తప్పేంటో తెలుసా..? పడక గదిలో భార్యను సుఖ పెట్టలేక పోవడమే. "సెక్స్ సుఖాన్ని ఇవ్వలేని నువ్వూ ఓ మగాడివేనా?" అంటూ హేళన చేసింది. దీంతో అవమానంతో పాటు... ఆగ్రహంతో రగిలిపోయిన ఆ భర్త... భార్యను చంపేశాడు. ఆ తర్వాత గుండెపోటుతో మరణించిందని నమ్మించేందుకు ప్రయత్నించి జైలుపాలయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం కూలూర్‌ గ్రామానికి చెందిన పొన్నాల లక్ష్మయ్య (47) అనే వ్యక్తి జీవనం కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఈ క్రమంలో ఆయన ఓ బ్యాంకులో ఉద్యోగం లభించింది. ఆ తర్వాత 1999లో సికింద్రాబాద్‌కు చెందిన విజయలక్ష్మితో అతనికి పెళ్లయింది. అయితే, ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో ఇద్దరూ విడిపోయారు.
 
ఆ తర్వాత 2005లో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మాధవి(27)ని లక్ష్మయ్య వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. భార్యాపిల్లలతో కలిసి హయత్ నగర్‌లో ఉంటున్నాడు. అయితే భార్య తరచూ పుట్టింటికి వెళుతుండటంతో ఆమెపై లక్ష్మయ్య అనుమానం పెంచుకున్నాడు. పుట్టింటికి మాటిమాటికి ఎందుకువెళ్తున్నావని అడిగితే, తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, నువ్వు నాకన్నా పెద్దవాడివని, సెక్స్‌ కోర్కెలను తీర్చలేకపోతున్నావని హేళన చేస్తూ వచ్చింది. 
 
హోలీ పండుగ మరుసటి రోజు లక్ష్మయ్య డ్యూటీకి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలోనూ ఆమె నువ్వు వయస్సులో పెద్దోడివి అంటూ హేళన చేసింది. దాంతో ఆమెను అట్లకాడ తీసుకుని తీవ్రంగా కొట్టాడు. కిందపడిపోయిన మాధవిని ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం 108కి సమాచారం ఇచ్చాడు. వారి వచ్చి పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించారు. గుండెపోటుతో తన భార్య చనిపోయినట్టు పోలీసులను లక్ష్మయ్య నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు లక్ష్మయ్యపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.